కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలను పాటించాలి ** ఎస్పి కె సురేష్ కుమార్ **

Published: Thursday May 19, 2022

ఆసిఫాబాద్ జిల్లా మే18 ప్రజాపాలన,ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో కేసుల దర్యాప్తులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులు పట్ల గౌరవంగా వ్యవహరించాలని, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో శాంతిభద్రతలపై బుధవారం ఎస్పి కే సురేష్ కుమార్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ మాట్లాడుతూ విజయ సాధనకు ఒక ముందుచూపు, దానిని సాధించడానికి ఒక ప్రణాళికాబద్ధమైన వ్యూహం  పోలీస్ అధికారులు కలిసి ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు నచ్చే విధంగా మనం అందించే సేవలలో, కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న సేవలను కాకుండా  కాలానుగుణంగా సమాజంలో ఉద్ధరించిన నేరాలతో ప్రముఖంగా ఉండి అరికట్టేందుకు సిద్ధం కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు. ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశంలో జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు అయినా గంజాయిని, నకిలీ పత్తి విత్తనాలు, అంతమొందించే దిశగా రాత్రింబవళ్ళు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆఛేశ్వర్ రావు, భీమ్రావు, డిఎస్పిలు, పోలీస్ అధికారులు, ఐటి కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.