పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉమ్మనేని రవి ని సిపిఎం పార్టీ సభ్యత్వం నుండి తొ

Published: Saturday April 15, 2023

బోనకల్ ఏప్రిల్ 14 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలో గోవిందపురం ఎల్ గ్రామానికి చెందిన ఉమ్మనేని రవి పార్టీ పద్ధతులకు భిన్నంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీకి నష్టం చేకూర్చే అనైతిక పద్ధతులు పాల్పడుతున్నందుకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు రవి ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించాలని సిపిఎం గోవిందపురం గ్రామ కమిటీ ఏకీభవంగా తీర్మానం చేయడం జరిగింది. రవి పార్టీ వ్యతిరేక కార్యకలాపాల చేయటం వలన రవి కి పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదని సిపిఎం గోవిందపురం గ్రామ కమిటీ కన్వీనర్ ఏడునూతన లక్ష్మణ్ రావు, సిపిఎం గ్రామ కమిటీ సభ్యులు ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత, కళ్యాణపు బుచ్చయ్య ,కళ్యాణపు శ్రీనివాసరావు, కారంగుల చంద్రయ్య, పొన్నం రాంబాబు, కోట కాటయ్య , నల్లమోతు వాణి, బండి చందర్రావు తదితరులు ఈ ప్రకటనలో తెలిపారు.