వసతుల కల్పనపై సమగ్ర అధ్యయనం చేయండి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ** బిఈఎల్ ప్రతినిధులతో సమావే

Published: Thursday September 08, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 07 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలో విద్యా వైద్య వసతుల కల్పనపై సమగ్ర అధ్యయనం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ప్రతినిధులకు సూచించారు. జిల్లాలో విద్య వైద్య మౌలిక వసతుల అవసరాలపై సర్వే నిమిత్తం వచ్చి మర్యాదపూర్వకంగా తాండూరు కలిసిన భారత్ ఎలక్ట్రికల్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులతో బుధవారం  జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వైద్య వసతుల కల్పనపై అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు కావలసిన వసతులు పై సమగ్ర సర్వే  నిర్వహించి నివేదిక అందజేయాలని సూచించారు. కంపెనీ ప్రతినిధులు జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి ని కూడా కలిసి శారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.