వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీటీసీ జోసఫ్..

Published: Friday February 17, 2023
తల్లాడ, ఫిబ్రవరి 16 (ప్రజాపాలన న్యూస్):
 తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన నీలం రాము, శ్రావణీల వివాహం గురువారం గ్రామంలో జరిగింది. ఈ వివాహ వేడుకకు అన్నారుగూడెం మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నాయకులు తాళ్ల జోసెఫ్ హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి దీవించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వార్డు మెంబరు షేక్ సైదామియా ఉన్నారు.