గైర్హాజరు విధ్యార్థులపై దృష్టిసారించాలి: జిల్లా విధ్యాధికారి డా.జగన్మోహన్ రెడ్డి

Published: Tuesday February 09, 2021
వెల్గటూర్, మార్చ్ 07 (ప్రజాపాలన): తొమ్మిది, పదో తరగతులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థుల గైర్హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారి డా.బి.జగన్ మోహన్ రెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని వెల్గటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుమ్మరి పల్లి లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం,ఆదర్శ పాఠశాలలు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ, కోవిడ్ నిబంధనలు అమలు తీరును పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, మధ్యాహ్న భోజనం బియ్యం నిల్వ తదితర అంశాలను పరిశీలించారు. వెల్గటూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటశాల, భోజనం వండుతున్న తీరును ఆయన పర్యవేక్షించారు. వంటలు చేసే ప్రదేశంలో పరిశుభ్రత పై మరింత జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.  కొవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తూ, తరగతుల నిర్వహణ చేపట్టాలని ఆయన సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పరిశుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఎస్. సుమలత, నసీం సుల్తానా, చంద్ర దాస్, ఆయా పాఠశాలలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 
Attachments are