జిల్లాలో బంద్ విజయవంతం

Published: Tuesday September 28, 2021
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్దం చేసిన విద్యార్థి సంఘాలు.
రాస్తారోకో నిర్వహించిన తపాలాపూర్ రైతులు.
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 27, ప్రజాపాలన : జిల్లాలో భారత్ బంద్ కు మిశ్రమ స్పందన లభించింది. దుఖానాలు, కిరాణా కోట్లు, చిన్న వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి భారత్ బందు కు మద్దతు నిచ్చారు. జిల్లా నలుమూలల్లో బందు ప్రబావం పాక్షికంగా కనిపించింది. ఆర్టీసీ బస్సు లు యదావిదిగా నడిచాయి. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ‘భారత్‌ బంద్‌’ పాటించాలని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఇచ్చిన పిలుపునకు జిల్లా లో కాంగ్రెస్‌ సహా పలు విపక్షాలు మద్దతు ప్రకటించగా సోమవారం రైతులతో కలిసి కాంగ్రెస్‌, ఆప్‌, సమాజ్‌వాదీ పార్టీ, వామపక్షాలు, బీఎస్పీ, తెదేపా తదితర పార్టీలు, విద్యార్థి సంఘాలు బంద్ లో పాల్గొని నిరసన తెలిపాయి. ఇప్పటివరకు 11 విడతలుగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఐక్య విద్యార్థి సంఘాలు. జిల్లా కేంద్రంలో భారత్ బంద్ కు మద్దతుగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో బందు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని,. ప్రధానంగా మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, కేంద్రం కు మద్దతు గా నిలిచిన రాష్ట్ర వైఖరిని వ్యతిరేకిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, పిడిఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట రాజేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మనోహర్, పిడిఎస్యు జిల్లెల శ్రీకాంత్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. తపాలా పూర్ రైతులు రాస్తారోకో కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ‘భారత్‌ బంద్‌’ పాటించాలని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఇచ్చిన పిలుపునకు జన్నారం మండలం తపాలా పూర్ గ్రామ రైతులు బందులో పాల్గొన్నారు. తపాలా పూర్ చెక్ పోస్ట్ వద్ద రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. దీంతో గంట సేపు వాహనాలు నిలిచిపోయాయి.