అమ్మ ఒడి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Published: Monday May 09, 2022
బెల్లంపల్లి. మే 8 ప్రజాపాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని అమ్మఒడి ఎన్ జి ఒ, అన్నదాత ప్రాజేక్ట్  ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ప్రతి ఆదివారం నిర్విరామంగా కొనసాగుతున్న అన్న దాన కార్యక్రమం ఈ రోజు కూడా కొనసాగిందని, బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమాన్ల మధుకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లిలో 2020న ప్రారంభించబడిన అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్ట్  బ్రాంచి మరియు టెక్నో డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఇప్పటివరకు నిర్విరామంగా కొనసాగుతుందని, అన్నం లేక అలమటించే ఎందరికో ఆకలి తీరుస్తూ, బెల్లంపల్లి పట్టణంలో వరకు 120వ సారి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈరోజు ఐబి తాండూర్ వాస్తవ్యులు అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ స్వర్గీయ కాసనగొట్టు సుగుణకర్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అభినవ సంతోష్ కుమార్, మరియు వారి కుటుంబ సభ్యులు మాతృ దినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, అన్నదాన కార్యక్రమము లో బెల్లంపల్లి సీనియర్ జర్నలిస్ట్ షకీల-షఫీ దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుమారుడు రిషప్ రోషన్ (సిజ్జు)చే పండ్ల పంపిణీ చేయడం జరిగిందని, బెల్లంపల్లి పట్టణంలో కాంట చౌరస్తాలో, పల్లేటూరి బస్టాండ్ నందు, యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు,బాటసారులకు 200 మందికి పైగా, పెరుగుఅన్నంతో అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమం నకు సహకరించిన దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు అభినవ సంతోష్ కుమార్, షకిల, షఫీ, రిషఫ్ రోషన్, సిజ్జు అమ్మఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ, హనుమండ్ల అమూల్య, నారాయణ, రొడ్డ హరీష్, గన్నెవరం తిరుమల చారి, బియ్యాల ఉపేందర్, చెందుపట్ల సందిప్, నాగుల ప్రక్యాత్, దొమల అభిరామ్ సాయి, తదితరులు పాల్గొన్నారు