"ఈ నెల14 న మాదిగ విద్యార్థుల చలో ఢిల్లీ"

Published: Thursday December 02, 2021
ఎంఎస్పి జిల్లా కోఆర్డినేటర్ రేగుంట మహేష్
జాతీయ మహాసభ విజయవంతం చేయండి
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ 01 (ప్రజాపాలన) : ఈనెల 14న చలో ఢిల్లీ మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ విజయవంతం చేయాలని ఎంఎస్పి జిల్లా కోఆర్డినేటర్ రేగుంట మహేష్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్సీ, సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేగుంట మహేష్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి నాయకులు గ్రామాలలో ఉన్నటువంటి మాదిగ కుల బంధువులను, ఎమ్మార్పీఎస్ నాయకులను, కలుస్తూ ఈనెల 14న ఢిల్లీలో జరిగే జాతీయ మహాసభను విజయవంతం చేయడానికి మాదిగ విద్యార్థులతో పాటు, యువకులు, ఉద్యోగులు, జిల్లాలోని మాదిగ కుల బాంధవులందరు ఢిల్లీకి రావాలని ఎం ఎస్పి జిల్లా కోఆర్డినేటర్ రేగుంట మహేష్, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు సాగర్ మాదిగ లు పిలుపునిచ్చారు. ఎస్పీ కులాలలోని 59 కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు దక్కాలని రాజ్యాంగంలోని న్యాయ సూత్రాలు అమలు కావాలని పోరాటాన్ని నిర్మించాలన్నారు. లక్షలాదిమంది మాదిగలతో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేసి 2000 సంవత్సరంలో ఎస్సీ రిజర్వేషన్లు ఏ బి సి డి లు గా వర్గీకరించి చట్టాన్ని సాధించారన్నారు. విద్యారంగంలో వేలాది సీట్లు పొందారని, గ్రూప్ వన్ గ్రూప్ టూ లు అనేక రంగాలలో మాదిగలు గణనీయమైన సంఖ్యలో నాడు ఉద్యోగంలో చేరారన్నారు. ఈ సమయంలోనే రాజకీయరంగంలో పంచాయితీ నుండి పార్లమెంటు వరకు మన ప్రాతినిధ్యం కూడా అనూహ్యంగా పెరిగిందని, రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశంలోనే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ బిల్లును ఆమోదించాలన్నారు. ప్రతి గ్రామం నుండి మాదిగ కులస్తులు మేము సైతం అంటూ ఈ నెల14న ఛలో ఢిల్లీ కి తరలి వచ్చి జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సిరికొండ సాయి కృష్ణ, వడ్లూరి చందూ, విద్యార్థి నాయకులు రాజేష్, సాయి కుమార్, రవీందర్, ప్రకాష్, బాలేష్ సోనియా, శైలజ, తదితరులు పాల్గొన్నారు