అధిక రక్తపోటుఆరోగ్యానికి తూట్లు డాక్టర్ వెంకటేష్

Published: Wednesday May 18, 2022

మధిర మే 17 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలోని మంగళవారం నాడు  ప్రపంచ రక్త పోటు దినోత్సవం సందర్భంగా మాటూరు పేట phc వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్  ఆధ్వర్యంలో రొంపి మల్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ sk.మదర్ , ఉప సర్పంచ్ శ్రీమతి గొల్లమందల సునీత , సెక్రెటరీ j.రాధ  సహకారంతో వైద్య శిభిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ వైద్య శిబిరం నందు గ్రామంలో 30 సంవత్సరాలు దాటిన అందరికీ షుగర్, బి.పి పరీక్షలు నిర్వహించి వారికి తగిన మందులు ఒక నెలకి సరిపోను ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి ,దానిని నియంత్రణలో ఉంచుకోండి. ఎక్కువ కాలం జీవించండి . ప్రభుత్వ వైద్య సిబ్బంది అందించే షుగర్, బిపి మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి, అని ప్రతి రోజు ఒక గంట సేపు వ్యాయామం చేయ వలెను.. షుగర్ ,బీపీలు అదుపులో ఉంచుకోకపోతే మూత్రపిండాల వైఫల్యం, గుండెకు సంబంధించిన ఎటువంటి సమస్యలు, పక్షవాతము, కంటికి సంబంధించిన రెటీనాసమస్యలు రావచ్చును.. కావున ప్రతి ఒక్కరూ షుగర్, బి.పి పరీక్షలు మీ గ్రామ ఆశ కార్యకర్త లేదా ఏఎన్ఎం ని సంప్రదించి పరీక్షలు చేయించుకొని మందులు క్రమం తప్పకుండా వాడ వలెనని వైద్యాధికారి గారు తెలియపరిచారు.. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతిM. లలిత కుమారి గారు, మండల డెవలప్మెంట్ అధికారి విజయభాస్కర్ రెడ్డి గారు, ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు భాస్కరరావు, శరత్ కుమార్, సుభాషిని మహిళా ఆరోగ్య కార్యకర్తలు సుజాత, ఝాన్సీ, ఆశా కార్యకర్తలు జమ్ములమ్మ నాగలక్ష్మి కుసుమ పాల్గొన్నారు.