మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సిహ్మా ప్రధమ వర్ధంతి గోడపత్రిక విడుదల

Published: Thursday July 22, 2021

ఇబ్రహీంపట్నం, జులై 21, ప్రజాపాలన ప్రతినిధి : సీపీఎం పార్టీ మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ మస్కు నర్సింహా గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం పాషా, నరహరి స్మారక కేంద్రంలో మస్కు నర్సింహా. మొదటి వర్ధంతి సందర్భంగా వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సాగర్. సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి దుబ్బాక రామ్ చందర్. ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కామ్రేడ్ మస్కునరసింహ చిన్నతనంలోనే విద్యార్థి దశలోనే ఎస్ ఎఫ్ ఐ ఉద్యమాలు మొదలుకొని ప్రజా ఉద్యమాల వైపు మొగ్గుచూపి ఎర్రజెండాలు చేతబట్టి అనేక కూలి పోరాటాల్లో భూమి పోరాటాల్లో అనేక గ్రామాలు తిరుగుతూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున పోరాటాలు చేసిన పోరాట వీరుడు అని మస్కునరసింహంను కొనియాడారు. చదువుకునే రోజుల్లోనే విద్యార్థి  ఉద్యమానికి ఆకర్షితుడై తన చివరి ప్రాణం ఉన్నంత వరకు ఎత్తిన ఎర్ర జెండా దించకుండా ప్రజా సమస్యలపై నిరంతరం తపించిన వ్యక్తి. పార్టీ ఇచ్చిన పదవి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా 2004 నుండి 2009 వరకు కొనసాగారు  ఐదు సంవత్సరాల కాలంలో తన పదవిని ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించారు. మన ఎమ్మెల్యే గెలిచిన ప్రారంభంలోనే నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని నియోజకవర్గంలో పర్యటించనున్న విధంగా కృషి చేసి నియోజకవర్గంలోని సమస్యలను ఈ ప్రాంతంలో కృష్ణా జలాల సమస్యను పరిష్కరించాలని  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మొదటి విడత 72 కోట్ల రూపాయలు మంజూరు చేయించి అన్ని గ్రామాలకు పైపులైన్ల ద్వారా కామ్రేడ్ నరసింహ గరని. అన్నారు. రెండో దఫా నిధులు రాకపోవడం వల్ల మరియు ఇబ్రహీంపట్నం నుండి హైదరాబాద్ వరకు ఫోర్ లైన్ రోడ్లు లేకపోవడం వల్ల అనేక మంది యువకుల ప్రాణాలు పోతున్నాయని వెంటనే ఫోర్ లైన్ రోడ్ రావాలని 5 వేల మందిని సమీకరించి హైదరాబాద్ వరకు పాదయాత్ర ఘనత మస్కు నర్సింహా గారిది అన్నారు. జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కాలేజీ ల కోసం జూనియర్ కళాశాల కోసం శ్రమించి జిల్లా వ్యాప్తంగా 2 డిగ్రీ కళాశాలలో 19 జూనియర్ కళాశాల సాధించిన వ్యక్తి పోరాటం కోసం అనేక లాఠీచార్జిలు, అరెస్టులు కేసులు సైతం లెక్కచేయకుండా పోరాడి వేలాది ఇళ్లస్థలాలు సాధించిన పోరాట పటిమ కలిగిన నాయకుడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలను ఎండగడుతూ పార్టీ ఇచ్చిన పిలుపు లన్నిటిని కూర్చో తప్పకుండా అమలు పరిచే దానికోసం అం పరితపించే వ్యక్తి చనిపోవడం జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు సిపిఎం పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించి పనిచేయాలని అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. జూలై 27న ఆయన ప్రధమ వర్ధంతి సభ ఇబ్రహీంపట్నం లోని శాస్త్ర గార్డెన్ లో జరుగుతుందని అన్నారు. ఈ సభకి సిపిఎం రాష్ట్ర రథసారధి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ చెరుపల్లి సీతారాములు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జాన్ వెస్లీ పాల్గొని ప్రసంగిస్తారు. కావున జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని అన్ని గ్రామాల ప్రజలు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని నర్సింహా గారి ప్రథమ వర్ధంతి సభను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ గోడపత్రిక విడుదల కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు రమేష్, జిల్లా కోర్ కమిటీ సభ్యులు బి.సామెల్, బి.మధుసూదన్ రెడ్డి,  ఎం చంద్రమోహన్, కమిటీ సభ్యులు ఇ.నర్సింహా, కే జగన్, కిసరా నర్సిరెడ్డి, నాయకులు p.అంజయ్య, డి. కిషన్, జి. కవిత, ఎస్. రాజు, ప్రకాష్, ch. ఏల్లేష్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.