వారందరికీ కనీస వేతనాలు చెల్లించాలి ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పోతు విజ

Published: Monday November 14, 2022
జన్నారం, నవంబర్ 13, ప్రజాపాలన:  ఉపాధి కూలీలు వ్యవసాయ కార్మికులు చిన్న ఉద్యోగులకు ప్రభుత్వం కనీస వేతనాలను చెల్లించాలని ఆదివారం ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్ (సిపిఎం) కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న వ్యవసాయ కార్మికులకు ఈజీఎస్ పనులలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. సిపిఎం పాలిత రాష్ట్రాలలో వారికి 600 రోజువారి వేతనంగా చెల్లిస్తారని ఆమె గుర్తు చేశారు. పేదరికంతో బాధపడుతూ రోజువారి ఉపాధి పైనే ఆధారపడిన వారికి చట్టం ప్రకారం కనీస వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. వ్యవసాయ కార్మికులకు ఈజీఎస్ కూలీలకు చిన్న ఉద్యోగులకు 600 రోజువారి వేతనంగా చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె కోరారు.