బలిజగూడ,,సర్వే నెంబర్ 55,56 లో సాగు చేసుకుంటున్నా రైతులకి పాస్ బుక్కులు ఇవ్వాలని రైతుబంధు, రైతు

Published: Friday September 09, 2022

అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడ గ్రామ సర్వే నెంబరు,55,56లో గత 70 సంవత్సరాలుగా సాగు చేసుకుని పంటలు పండించుకుని జీవిస్తున్న ఈ రైతులకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి పాసుబుక్కులు మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. పాస్ బుక్ లేకపోవడం వల్ల, రైతులకి రైతుబంధు, మరియు రైతు బీమా రాకుండా నష్టపోతున్నారు. అంతేకాకుండా అట్టి భూమిని పరిశ్రమల పేరుతో ప్రభుత్వం తీసుకోవడం కోసం పెద్ద కుట్ర చేస్తూ పాసుబుక్కులు రాకుండా చేస్తున్నారు. రైతులకి ఆ భూమి తప్ప మరో ఆధారం లేదు అందువల్ల కొన్ని లక్షల రూపాయలు పెట్టి రాయి, రప్ప, తీసివేసి బోరు బావులు తొవ్వుకొని కరెంటు మీటర్లు తీసుకుని చక్కటి పంటలు పండించుకుని జీవిస్తున్న, రైతుల పొట్ట కొట్టాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది, రైతులు తమ ప్రాణాలు పోయిన భూమిని మాత్రం వదిలేయడం లేదని ఎంతటికైనా తెగించి పోరాడుతామని రైతులందరూ పట్టుదలతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ మాట్లాడుతూ రైతుల భూములు పోకుండా, పాస్ బుక్ లో వచ్చేంతవరకు వారికి అండగా ఉంటూ ఎంత పెద్ద ఉదృతమైన పోరాటాల చేయడానికి అయినా సిద్ధంగా ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కావున వెంటనే రైతులకు పాస్బుక్కులు ఇచ్చి, రైతుబంధు మరియు రైతు బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు. రైతులకు అన్యాయం చెయ్యకపోతే ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు వరకాల ముత్యాలు, గుండె శివకుమార్, బలిజగూడ మాజీ సర్పంచ్ ఇరుగు జంగయ్య, ఆరుట్ల ముత్యాలు, మేడు వెంకటేష్, బిక్షపతి, ఉప్పు శివ, జానీ, పోచమ్మ కమలమ్మ, కౌసల్య అనేకమంది రైతులు పాల్గొన్నారు.