విశేష సేవలు అందించిన వ్యక్తులకు తగిన గుర్తింపు

Published: Tuesday February 28, 2023
* గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, కరోనా ఆపత్కాలంలో ఆపన్న హస్తం
* ఎస్సి ఎస్టీ బిసి మైనారిటీ సాహిత్యానికి తోడ్పాటు
* మన్నేగూడ ఎంపిటిసి సయ్యద్ ఆదిల్ కు బహుజన సాహిత్య అకాడమీ పురస్కారం
వికారాబాద్ బ్యూరో 27 ఫిబ్రవరి ప్రజాపాలన : సమాజంలో ఆర్థిక రాజకీయ సమానత్వం కోసం కృషి చేసే సంస్థలకు వ్యక్తులకు సేవారత్న జాతీయ అవార్డును ఇస్తారని మన్నేగూడ ఎంపిటిసి సయ్యద్ ఆదిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం హైదరాబాద్ లో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవార్డు ప్రదానం కార్యక్రమంలో భాగంగా బహుజన సాహిత్య అకాడమీ సెలెక్షన్ కమిటీ  చైర్మన్ నల్ల రాధాకృష్ణ మన్నేగూడ ఎంపిటిసి సయ్యద్ ఆదిల్ కు సేవారత్న జాతీయ అవార్డును బహూకరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మన్నెగూడ ఎంపీటీసీ సయ్యద్ ఆదిల్ మాట్లాడుతూ 2023 సంవత్సరంకుగాను బహుజన సాహిత్య అకాడమీ ( బిఎస్ఎ ) అవార్డు రావడం సంతోష దాయకమని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అన్ని రంగాలలో అభివృద్ధికి  తోడ్పాటు అందించే వ్యక్తులకు సంస్థలకు సేవా రత్న అవార్డును ప్రకటించడం శుభ పరిణామం అని కొనియాడారు. ఆదిల్ గ్రూప్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కరోనా విపత్కర సమయంలో ఆపన్న హస్తం అందించినందుకుగాను జాతీయ సేవా రత్న అవార్డు వచ్చిందని అన్నారు. ఆదిల్ గ్రూప్ ద్వారా అన్ని సామాజిక వర్గాలకు ఆర్థిక, సామాజిక, విద్యా, వైద్య పరంగా సేవలు అందజేయనున్నామని స్పష్టం చేశారు. బహుజన సాహిత్య అకాడమీ
అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాదులోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారని వివరించారు.

ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు కవులకు,స్వచ్ఛంద సంస్థలకు అవార్డు అందజేయనున్నట్లు తెలియజేశారు. ఈ సంవత్సరం మార్చి 12వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో నిర్వహించే బహుజన రైటర్స్ 6వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా విద్యా రత్న నేషనల్ అవార్డును అందజేయనున్నట్లు తెలియజేశారు. సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,తమిళనాడు, కర్ణాటక, కేరళ,పుదుచ్చేరి రాష్ట్రాల నుండి సుమారు 600 మంది డెలిగేట్స్ కాన్ఫరెన్స్ కు హాజరవుతారని తెలియజేశారు.సమాజంలో అందరూ సేవాభావంతో పనిచేయాలని సూచించారు. సమాజంలో ఆర్థిక రాజకీయ సమానత్వం కోసం అందరూ కృషి చేయాలని అప్పుడే మనకు ఆర్థిక రాజకీయ స్వాతంత్ర్యం ఏర్పడుతుందని తెలిపారు. బహుజన సాహిత్య అకాడమీ వారు సమాజంలో మంచి చేసే వారిని శోధించి గుర్తించి  ఇవ్వాలని సూచించారు. అప్పుడే అందరూ సేవ చేయడానికి ముందుకు వస్తారని ఆకాక్షించారు. ఈ అవార్డు లెటర్ అందజేసిన వారిలో బిఎస్ఎ తెలంగాణ అధ్యక్షులు గౌతం మల్లేష్, స్వేరో సర్కిల్ జిల్లా అధికార ప్రతినిధి ఎరన్ పల్లి శ్రీనివాస్, హ్యూమన్ రైట్స్ కమిషన్ జిల్లా నాయకులు రఫీ, ఉప సర్పంచ్ హసిబ్ మాజీ సర్పంచ్ సాయిలు మన్నెగూడ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.