శేరిలింగంపల్లిలోని నెహ్రూ నగర్, గోపి నగర్ ముంపు, లోతట్టు ప్రాంతాల్లో బీజేపీ నాయకుల పర్యటన

Published: Thursday June 17, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు బుధవారం శేరిలింగంపల్లి 106 డివిజన్ బీజేపీ అధ్యక్షులు రాజు శెట్టి కురుమ అధ్వర్యంలో నెహ్రూ నగర్, గోపినగర్ లలోని ముంపు, లోతట్టు ప్రాంతాలను పర్యటించి, రానున్న వర్షం కాల వరదల దృష్యా ప్రజలను అప్రమత్తం చేసి తగిన జాగ్రతలు పాటించాలని, దురదృష్టవశాత్తు ఇల్లు నీట మునిగితే వారికి తాత్కాలిక పునరావాసం కల్పిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే బస్తీ లోని రోడ్లు, డ్రైనేజ్, తాగు నీటి సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు, నెహ్రూ నగర్ లో రోడ్లు సరిగా లేవని, చాలా కాలంగా రోడ్ల మీద డ్రైనేజ్ పొంగి పొర్లుతున్నాయిని టీ.అర్.ఎస్ నాయకులకు ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించుకునే నాధుడే లేదని స్థానికులు వాపోయారు, డ్రైనేజ్ వల్ల దుర్గంధం, అనేక వ్యాధులు సోకుతున్నాయని తమ భాధను వ్యక్తం చేశారు. ఈ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరించే ప్రయత్నం చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం నాయకులు నీరటి చంద్ర మోహన్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్య కుర్మ, ఉపాదక్ష్యులు బాలరాజు, కోశాధికారి పి.కౌసల్య, భీమాని విజయ లక్ష్మి, భీమాని సత్యనారాయణ ముదిరాజ్, సిద్దు కురుమ, నీలకంఠ రెడ్డి, స్వాతి, పౌల్, సాయి యాదవ్ మరియు స్థానికులు పాల్గొన్నారు.