లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగులు వితరణ..

Published: Wednesday October 19, 2022
తల్లాడ, అక్టోబర్ 18 (ప్రజాపాలన న్యూస్):
 తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనకల్ మెయిన్ రోడ్డు నందు గల సులగం నరసింహారావు టీ కొట్టు కూల్డ్రింక్స్, షేక్ సైదులు తోపుడు బండి పై పండ్ల  వ్యాపారం చేసుకునే ఇద్దరు వ్యక్తులకు గొడుగులు వితరణ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ తల్లాడ లయన్స్ క్లబ్ తరఫున తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునే ఇద్దరికీ గొడుగులు డిస్టిక్ కమ్యూనిటీ సర్వీసెస్ నంబూరు మధు స్పాన్సర్ చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మిట్టపల్లి సెంటర్ నందు మాకు లయన్స్ క్లబ్ తరఫున ఐదుగురు కొత్త నెంబర్లు సభ్యత్వం తీసుకున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మా సెంటర్లో గొడుగులు ఇవ్వాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిసీలు మిట్టపల్లి నరసింహారావు, పులబాల వెంకటేశ్వర్లు, సెక్రెటరీ వేమిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి, లయన్ మిత్రులు బెల్లంకొండ ఆంజనేయులు, చిట్టా నాగేశ్వరరావు, ఎస్.కె మైబు,మోటమర్రి రమేష్, గూడూరు సతీష్ రెడ్డి, ఎలినేని రాంబాబు, చిత్తులూరి నరసింహారావు పాల్గొన్నారు.