షార్ట్ ఫిలిల్మ్స్, ఫోటోగ్రఫీ పోటీలో పాల్గొనండి** జిల్లా ఎస్పి సురేష్ కుమార్ **

Published: Wednesday October 19, 2022
ఆసిఫాబాద్ జిల్లా అక్టోబర్ 18 (ప్రజాపాలన, ప్రతినిధి) : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 19 నుండి 31 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్ పి కె సురేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలో ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం ఫోటోలు నిర్వహిస్తున్నామని,  పాల్గొనేవారు పోలీస్ విధులు, వివిధ రకాల సేవలపై మూడు నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిం పంపించాలన్నారు. సామాజిక - మాణవీయ ఈ కోణంలో పోలీసు విధులకు  సంబంధించిన ఫోటోలను ఈ నెల 24 వరకు పూర్తి వివరాలతో జిల్లా పోలీసు కార్యాలయంలో (డిపిఓ) అందించాలన్నారు. ఫోటోలు  అక్టోబర్ 2021, అక్టోబర్ 2022 మధ్య కాలానికి సంబంధించినవై ఉండాలన్నారు. దీంతో ఇంటర్, డిగ్రీ, విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
 
 
 
Attachments area