ఉప్పల్లో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు

Published: Monday August 01, 2022
మేడిపల్లి, జూలై31 (ప్రజాపాలన ప్రతినిధి) 
ఉప్పల్లో బోనాల పండుగ ఉత్సవాలను అంగరంగ వైభముగా నిర్వహించారు. శ్రీ పోచమ్మ, శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో బోనాల జాతర  సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
బోనాల పండుగ ఉత్సవాల కార్యక్రమంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు  చామకూర మల్లారెడ్డి,ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంచార్జ్        మర్రి రాజశేఖర్ రెడ్డి, చిలుకా నగర్ కార్పొరేటర్ బన్నల గీత ప్రవీణ్ ముదిరాజ్, ఎం బి ఎస్ ఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు బేతి సుమంత్ రెడ్డి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల మధుసూదన్ రెడ్డి, గడ్డం రవికుమార్, వేముల సంతోష్ రెడ్డి, చింతల నరసింహారెడ్డి, వేముల వెంకట్ రెడ్డి, స్వీట్ హౌస్ రాజు, గొరిగే ఐలేష్ ,అరటికాయల వంశీ ముదిరాజ్ టిఆర్ఎస్ నాయకులుు, కార్యకర్తలు స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.