అభివృద్ధిలో అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Thursday August 18, 2022

మధిర రూరల్ ఆగస్టు 17 ప్రజాపాలన ప్రతినిధి అభివృద్ధిలోతెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఆత్కూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన నూతన పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ అబ్బూరి సంధ్యారాణి అధ్యక్షులు జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 57 సంవత్సరాలకే సామాజిక పెన్షన్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వలన పేదలకు లబ్ధి చేకూరిందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గ్రామాల్లో ఉన్న సమస్యలను, గుర్తించి,అవి పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులతో మధిర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో మధిర నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు  దళిత బంధు లాంటి అనేక పథకాలు ఇతర రాష్ట్రాల్లో సైతం అమలు చేస్తున్నారంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మధిర నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు రాజకీయాలకతీతంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరావు ఎంపీపీ మెండెం లలిత రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు చావా వేణు టిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు అబ్బూరి రామన్ తదితరులు పాల్గొన్నారు.