లబ్ధిదారునికి రేషన్ బియ్యం అందక కష్టాలు నాలుగు సంవత్సరాల నుండి రేషన్ బియ్యం తీసుకొని నిరుప

Published: Saturday December 03, 2022

 

బోనకల్, డిసెంబర్ 2 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామ హరిజనవాడలో ఒక నిరుపేద కుటుంబానికి గత నాలుగు సంవత్సరాల నుండి రేషన్ బియ్యం అందక ,కుటుంబాన్ని పోషించలేక ఆ నిరుపేద కుటుంబం నానా అవస్థలు పడుతుంది. వివరాల్లోకి వెళితే ఇళ్ల ఆదాం తండ్రి నాగయ్య నిరుపేద కుటుంబం అయి ఉండి సొంత ఇల్లు లేక కిరాయి పూరి గుడిసెలో జీవనం సాగిస్తూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లబ్ధిదారునికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. తన కుటుంబాన్ని కూలి పనులు చేసుకుంటూ చేసిన పనికి కూలి సరిపోక, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉండి నెల నెల రేషన్ బియ్యం అందక గత నాలుగు సంవత్సరాల నుండి కుటుంబ పోషణ సరిగా లేక పడలేని కష్టాలు పడుతున్నాడు.లబ్ధిదారుడు రేషన్ షాపు నంబర్ 2, డీలర్ దగ్గరికి రేషన్ కార్డు తీసుకొని పోతే ఈ కార్డు మీద బియ్యం రావట్లేదని డీలర్ చెప్తున్నాడు. బుధవారం రావినూతల గ్రామ నెంబర్ 2 రేషన్ షాపు తనిఖీల్లో భాగంగా అధికారులు అక్కడికి వస్తే లబ్ధిదారుడు ఇళ్ల ఆదాం తన రేషన్ కార్డు ని అధికారులకు చూపించాడు. ఈ కార్డు మీద బియ్యం వస్తున్నాయి అని అధికారులు చెప్పారు. కానీ రేషన్ షాప్ కి కార్డు తీసుకొని పోతే రేషన్ బియ్యం ఇవ్వటం లేదు. ఏమిటి అని అడిగితే నీ కార్డు ఆన్లైన్లో ఎక్కలేదని, అందుకే రేషన్ బియ్యం రావడంలేదని డీలర్ చెప్తున్నాడు. అదేవిధంగా మరి కొంతమంది లబ్ధిదారులు రేషన్ షాప్ దగ్గరికి వచ్చి తంబు వేస్తుంటే ఆన్లైన్ కావట్లేదని తిరిగి వెనకకు పంపిస్తున్నాడు. పై అధికారులు చొరవ తీసుకొని నిరుపేద కుటుంబం అయినా ఆదాం కుటుంబానికి రేషన్ బియ్యం ప్రతినెల అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారుడు కోరుతున్నాడు. అదేవిధంగా గ్రామంలో మరి కొంతమంది లబ్ధిదారులు రేషన్ బియ్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ షాపులో సక్రమంగా రేషన్ బియ్యం పంపిణీ చేసేలా పై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు.