జిల్లాలో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు ** విద్యార్థి యువజన సంఘం నాయకులు **

Published: Saturday November 26, 2022
ఈనెల 28న ప్రతిపక్ష పార్టీలతో రాస్తారోకో **
 
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 25 (ప్రజాపాలన, ప్రతినిధి) : పోరాటాల వల్ల ఏర్పడ్డ జిల్లాలో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదని విద్యార్థి యువజన సంఘాల నాయకులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఈనెల 28న విద్యార్థి యువజన, కుల, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో నెలకొన్న అవినీతి అక్రమాల పైన విచారణ చేపట్టాలని, అవినీతి అక్రమాలపై నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా కలెక్టర్ ను బదిలీ చేయని డిమాండ్ తో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన మహా ధర్నా కార్యక్రమం నిర్వహించి నేటికీ 4,5, రోజులు గడుస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై వారు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ రాస్తారోకో కార్యక్రమానికి  పిలుపునివ్వడం జరిగిందన్నారు. అక్రమాలకు పాల్పడ్డ జిల్లా అధికారులపై కేసులు నమోదు చేసే వరకు, జిల్లా కలెక్టర్  బదిలీ అయ్యేంతవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆత్మకూరు చిరంజీవి, డివైఎఫ్ఐ గోడిసెల కార్తీక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్, చాప్రే సాయి, తిరుపతి, మల్లికార్జున్, కళ్యాణ్, సాయిరాం, జావేద్, తదితరులు పాల్గొన్నారు.