పల్లెల పరిశుభ్రతే ప్రథమ లక్ష్యం

Published: Tuesday July 06, 2021
రోడ్డువైపు పిచ్చి మొక్కల తొలగింపు
మిషన్ భగీరథ లీకేజీల మరమ్మత్తు
వికారాబాద్ జూలై 05 ప్రజాపాలన బ్యూరో : నాల్గవ విడత పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి పల్లె సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. పల్లె ప్రగతి కారణంగా గ్రామ ప్రజలకు చేతినిండా పని దొరకడంతో ఆర్థికాదాయం పెరిగింది. సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని నారాయణపూర్ లో పంచాయతీ కార్యదర్శి వెంకటేశం పిచ్చి మొక్కల తొలగింపు పనులు, ఎర్రవల్లి గ్రామంలో సర్పంచ్ మల్లమ్మ భర్త హనుమంతు మిషన్ భగీరథ లీకేజీల మరమ్మత్తు పనులను చేయించారు. జామ, నిమ్మ, దానిమ్మ, తులసి, మునగ, ఉసిరి మొక్కలను ఇంటికి 6 చొప్పున పంపిణీ చేశారు. రోడ్డుకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కల తొలగింపు పనులు జోరందుకున్నాయి. పారిశుద్ధ్య పనులు, తడి పొడి చెత్త సేకరణ వంటి పనులు నిత్యకృత్యాలుగా మారాయి. గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అమూల్యం.