బోనకల్ మండల అధ్యక్ష కార్యదర్శులు గా చేబ్రోలు మల్లికార్జునరావు

Published: Monday September 27, 2021
బోనకల్, సెప్టెంబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండల అధ్యక్ష కార్యదర్శులు గా చేబ్రోలు మల్లికార్జునరావు మోదుగ నాగేశ్వరరావు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మమ్మల్ని నియమించినందుకు రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ కొండల కొండల రావు, మధిర నియోజవర్గ ఇన్చార్జి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా నియామకాలకు సహకరించిన బోనకల్ మాజీ మండల అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మండలంలోని గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రజా ప్రతినిధులకు మరియు రైతుబంధు జిల్లా మండల గ్రామ సభ్యులకు మండల టిఆర్ఎస్ నాయకులకు గ్రామ టిఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.