రైతులను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ దే* ఆత్కూర్ రచ్చబండ కార్యక్రమంలో కిషోర్

Published: Tuesday May 31, 2022
మధిర రూరల్ మే 30 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో సోమవారం నాడురైతులకు అండగా నిలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు సీఎల్పీ నేత మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సోమవారం మండల పరిధిలోని   ఆత్కూర్ గ్రామంలో  రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు
ఇందిరమ్మ రైతు భరోసా పథకం, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15000 రూపాయలు, భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇస్తామని ఆయన తెలిపారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ఆర్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో పాటు ధరణి పోర్టల్ రద్దుచేసి దాని స్థానంలో అందరి భూములకు రక్షణ కల్పించేలా సరికొత్త రెవిన్యూ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ  ఎస్సీ సెల్  అధ్యక్షులు  
దారా బాలరాజు  యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అద్దంకి రవి మండల బీసీ సెల్ అధ్యక్షులు చిలువేరు బుచ్చి రామయ్య పట్టణ బిసి సెల్ అధ్యక్షులు బిట్రా   ఉద్దండు మాజీ సర్పంచ్  కర్నాటిరామారావు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లె పోగు సత్యానందం కంచె పోగు మరియమ్మ ఖమ్మంపాటి వీరయ్య కంచి పోగు లాజరు కంటిపూడి పుల్లయ్య నల్లపు భాస్కర్ రావు డాలు పుల్లయ్య యంగల వీరయ్య దూదేకుల కాశయ్య పల్లె పోగు లక్ష్మయ్య బొల్లె పోగు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.