ఎంటర్ ప్రెన్యూర్ షిప్ స్కిల్స్ పై అవగాహన సదస్సు

Published: Friday April 29, 2022
మధిర ఏప్రిల్ 28 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మధిర, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు ఆల్ఫా కంప్యూటర్ ఎడ్యుకేషన్ అధినేత పి.నాగరాజు ఎంటర్ ప్రెన్యూర్ షిప్ స్కిల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ సెల్ కన్వీనర్ శ్రీమతి శీలం.ఇందిర, ప్రిన్సిపాల్ ALN శాస్త్రి, వైస్ ప్రిన్సిపాల్ మరియు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానంతరం నాగరాజుని సత్కరించారు