జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ

Published: Monday June 14, 2021
బాలపూర్, జూన్ 13, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తించాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. మీర్ పెట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో కరోనా మహమ్మారి కష్టకాలంలో సైతం ప్రజల కష్టాలను ప్రభుత్వం కు చేరవేసి, వారి సమస్యలకు పరిష్కారం చూపుతూ, అనుక్షణం ప్రజలతో మమేకమై పోరాడుతున్న కలం వీరులకు నాణ్యమైన నిత్యావసరాల సరుకులను కాంగ్రెస్ పార్టీ నాయకులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పోరేషన్ పరిధిలోని మీడియా సోదరులకు  మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి  చేతుల మీదుగా  25Kg బియ్యం, కంది పప్పు, మంచి నూనె, గోధుమ పిండి వగైరా అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..... పాత్రికేయులు ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో పాత్రికేయులు ముందు వరుసలో ఉన్నారని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక జర్నలిస్టులకు ఇండ్లు ఇస్తామని, ఆరోగ్య భద్రత కార్డు ఇస్తాం  చెప్పిన టిఆర్ఎస్   ప్రభుత్వం వారిని మోసం చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్ట్ లను కరోనా ప్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి, వారికి నెలకు ప్రత్యేక నగదు, నిత్యావసర సరుకులు అందించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భాస్కర్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వాని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దన్ని మహేష్, కాంటెస్ట్ కార్పోరేటర్స్ బాలక్రిష్ణ, స్వామి నాయక్, మాల్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, పెద్దవూర సైదులు, చిలకరాజు సాయి జగదీష్, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.