ప్రగతిభవన్ కు అంబేద్కర్ పేరు పెట్టండి --బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం

Published: Thursday September 15, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 14 ( ప్రజాపాలన ప్రతినిధి): రాజకీయ ఎత్తుగడలలో భాగంగానే పార్లమెంటుకు అంబేద్కర్ పేరును సీఎం కేసీఆర్ కోరుతున్నాడని ప్రగతిభవన్ కు అంబేద్కర్ పేరు పెట్టి తన చిత్త శుద్ధి చాటుకోవాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బీజేపీ కౌన్సిలర్ అనుమల్ల కృష్ణహరి నివాసంలో భేటి ఆనంతరం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుర్చీ చెప్పుతో సమానమని సీఎం అవమానించారన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అంబేద్కర్ ను అవమానించారన్నారు. దళితులను మచ్చిక చేసుకోవడానికే అంబేద్కర్ నినాదం ఎత్తుకున్నారని అన్నారు. ఏనాడు అంబేద్కర్ జయంతి, వర్ధంతిలకు దండవేసి దండం పెట్టిన పాపాన ముఖ్యమంత్రి పోలేదన్నారు. రాజకీయాల కోసమే అంబేద్కర్ పాట పాడుతున్నాడని ట్యాంకుబండ్ పక్కన నిర్మిస్తామని చెప్పిన అంబేద్కర్ విగ్రహం ముచ్చట ఏమైందని మర్రిపెల్లి సత్యం, అనుమల్ల కృష్ణహరి ప్రశ్నించారు. సీఎం కు చిత్త శుద్ధి ఉంటే ప్రగతిభవన్ కు అంబేద్కర్ పేరు, కొత్త సచివాలయానికి సర్దారవల్లబాయ్ పటేల్ పేరు ను పెట్టాలని వారు డిమాండ్ చేశారు. వారివెంట బిజెపి లీగల్ సెల్ నాయకులు బెజ్జరపు ప్రవీణ్ కుమార్, జున్ను రాజేందర్ లు ఉన్నారు.

 
 
 
Attachments area