దేశ అభివృద్ధికై విద్య న్యాయ వ్యవస్థలలో మార్పులు అవసరం స్వతంత్ర శాస్త్రవేత్త శ్రీనివాస్ చా

Published: Wednesday April 19, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 18 (ప్రజాపాలన ప్రతినిధి)
 దేశ అభివృద్ధి కొరకు దేశంలోని విద్య, న్యాయ వ్యవస్థలలో మార్పులు అవసరమని హైదరాబాద్ రామంతాపూర్ కు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్త శ్రీనివాస్ చామర్తి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను తెలుసుకోవడం కోసం తన బైక్ పై 
 గత 8 సంవత్సరాలుగా 15-07-2015 నుండి 08-04-2023 వరకు 
2,01,82.5కిమీ, 367 ఉపన్యాసాలు మరియు 559 సంభాషణలతో ఈ ప్రస్తుత ప్రయాణ పూర్తయిన సందర్భంగా మంగళవారం ఉప్పల్ ప్రెస్ క్లబ్లో స్వతంత్ర శాస్త్రవేత్త శ్రీనివాస్ చామర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
 యువత సామాజిక ఆర్థిక ఆలోచనా ప్రక్రియపై దృష్టి సారించడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడే టెక్నాలజీ, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ మరియు డిజైనింగ్ మొదలైన వాటిలో ఆలోచించడానికి, పని చేయడానికి తయారు చేయడానికి, వారి కెరీర్ని నిర్మించుకోవడానికి యువతను శక్తివంతం చేయడం కోసమే ఈ బైక్ ప్రయాణం కొనసాగిందని తెలిపారు.   యువతకు దిశా నిర్దేశం చేయడంలో తన వంతు కృషిలో భాగంగా సోషల్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశం అభివృద్ధి చెందడానికి దేశంలోనే మేకింగ్  ఇండియాలో భాగంగా యువతకు స్కిల్ డెవలప్మెంట్ , స్టార్ట్ అప్ కు సంబంధించిన అవగాహన కల్పించడం అవసరమని భావించి ఆ దిశగా తన వంతు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే దేశంలో ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఉపయోగించుకోవడం, ఎగుమతులు చేసి విధంగా  బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు విద్యను సమాజానికి ఉపయోగపడే విధంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ఇంజనీర్లు శాస్త్రవేత్తలు దేశ ఆర్థిక పరిస్థితి అభివృద్ధి కొరకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని ఆయన కోరారు. దేశాభివృద్ధిలో సమాజం న్యాయవ్యవస్థ మధ్యలో ఉన్న గ్యాప్ ను రూపుమాపడానికి తన వంతు కృషి చేయాలని నిశ్చయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.