పెండింగ్లో ఉన్న కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, చెక్కులను విడుదల చేయాలి ** కెవిపిఎస్ జిల్లా కార్

Published: Tuesday August 30, 2022

ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు29 (ప్రజాపాలన, ప్రతినిధి) : గత సంవత్సర కాలం నుండి పెండింగులో ఉన్న షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను తక్షణమే విడుదల చేసి పేదలను ఆదుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దుర్గం దినకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పథకానికి నిధుల కొరత ఏర్పడి  గత ఏడాది నుండి చెక్కులు రాకపోవడంతో చెక్కుల కొరకు ఆర్డిఓ, తహసిల్దార్ల, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసాను కల్పించుట కొరకు తెచ్చిన ఈ పథకాన్ని నిద్ర కొరతతో నీరు కార్చకుండా ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని పేదలకు చెక్కులు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.