పాత మిట్టపల్లిలో సీసీరోడ్డుకు శంకుస్థాపన..

Published: Friday November 26, 2021
తల్లాడ, నవంబర్ 25 (ప్రజాపాలన న్యూస్) : తల్లాడ మండలంలోని పాత మిట్టపల్లి గ్రామంలో సీసీ రోడ్డుకు గ్రామ సర్పంచ్ మాగంటి క్రిష్ణ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయితీ అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్లను నిర్మించడం జరుగుతుందని తెలిపారు. సిమెంట్ రోడ్డు తో పాటు గ్రామంలో గ్రావెల్ మట్టిని కూడా తోలించి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. గ్రామ పెద్దల సూచనల మేరకు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుత్తికొండ అన్నమ్మ, సెక్రెటరీ సురేష్, వార్డ్ మెంబర్ లు యరమల బసివిరెడ్డి, సాయిన్ని కృష్ణకుమారి, గ్రామ పెద్దలు మువ్వా రోశయ్య, మువ్వా మల్లిఖార్జునరావు, నాయకులు మీర్జా మైబు, మాగంటి శ్రీను, వెంకటేశ్వర్లు, అక్బర్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.