పలు డివిజన్లలో పట్టణ ప్రగతిని పర్యవేక్షించిన కార్పొరేషన్ మేయర్

Published: Tuesday July 06, 2021
బాలాపూర్, జులై 05, ప్రజాపాలన ప్రతినిధి : చెట్లు నాటి కాలుష్యాన్ని నివారించాలి, పట్టణ ప్రగతి లో కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలిని కార్పొరేషన్ మేయర్ అన్నారు. బడంగ్ పేట్  మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ విడత పట్టణ ప్రగతి లో భాగంగా సోమవారం నాడు పలు డివిజన్ల లో పర్యటించి జరుగుతున్న పనులను పరివేక్షించిన బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. 30వ, 23వ, 29వ, 28వ డివిజన్లలోని రోమా ఎంక్లైవ్, వెంకటాద్రి నివాస్, మాతృశ్రీ కాలనీ, శ్రీ కృష్ణ కాలనీ, బడంగ్ పేట్ గ్రామంలలో పర్యటించిన మేయర్ కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...... పట్టణ ప్రగతి కార్యక్రమ ద్వారా కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, చెట్లను నాటి కాలుష్యాన్ని నివారించాలని అన్నారు. మీ మీ  ఇంట్లో కూడా పూల మొక్కలు పెంచేలా కాలనీ అసోసియేషన్ కృషి చేయాలని చెప్పారు. వార్డు కమిటీలలో కాలనీ ప్రజలు సైతం భాగస్వాములు కావాలని త్వద్వారా సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువస్తే త్వరగా పరిష్కరించబడే ఆస్కారం ఉంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు భీమిడి స్వప్న జంగారెడ్డి, రాళ్లగూడెం సంతోష శ్రీనివాస్ రెడ్డి, పెద్దబావి శోభా ఆనంద్ రెడ్డి, సుర్ణగంటి అర్జున్, ఏఈఈ బిక్కు నాయక్, అధికారులు కాలనీ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.