30 శాతానికి తగ్గకుండా 11 వ వేతన కమిటీలో నిర్ణయించాలి వినతి పత్రం సమర్పించిన టీబీజీకేస్ నాయకుల

Published: Wednesday November 30, 2022
బెల్లంపల్లి నవంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి: ఢిల్లీలో జరిగే సింగరేణి కార్మికుల 11వ వేతన కమిటీ సమావేశాల్లో 30 శాతానికి తగ్గకుండా  నిర్ణయాలు తీసుకోవాలని, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మంగళవారం బెల్లంపల్లి ఏరియాలోని గనులు, డిపార్ట్మెంట్లలో అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో టీబీజీకేఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ జాతీయ కార్మిక సంఘాల నాయకులు వేతన కమిటీ చర్చల్లో ముప్పై  శాతానికి తగ్గకుండా వేతన కమిటీలో నిర్ణయాలు తీసుకోవాలని, లేని పక్షంలో జాతీయ సంఘాలకు వ్యతిరేకంగా, కార్మికుల సహకారంతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
అనంతరం ఆసుపత్రి డివైసీఎం ఓ కు వినతి పత్రాన్ని సమర్పించి విధులకు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అన్ని వర్గాల సిబ్బంది పాల్గొన్నారు.