నీటి సమస్య తో బిందెలతో రోడ్డుపై బైఠాయించిన మహిళలు

Published: Friday August 06, 2021
గుమ్మడిదల, ఆగస్టు 05, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో నీటసమస్యతో కాళీ బిందెలతో రొడ్డుపై బైఠాయించి బంగారు తెలంగాణ ఇదేనా అంటూ సర్పంచ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ధర్నాకు దిగిన ఎనిమిదో వార్డు మహిళ దోమడుగు గ్రామంలోని ఏడవ మరియు ఎనిమిదవ వార్డులో గతేడాది నుండి నీటి సమస్య ఉందని పలుమార్లు గ్రామ పంచాయతీలో సర్పంచ్ కు వార్డు సభ్యుల కు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పాలకవర్గం వాడుకోవడానికి కూడా నిరుపయోగంగా ఉన్న నీటిని వారానికి ఒక ట్యాంకర్ పంపుతున్నారని నీటిని వాడటం వల్ల పిల్లలకు పెద్దలకు రకరకాల చర్మ సమస్యలు రావడమే కాకుండా వస్త్రాలు కూడా నిరుపయోగంగా మారుతున్నాయి. మంచినీటి కోసం వృద్ధులు ట్యాంకర్ల వద్దకు బిందెలతో పోగా వారికి కింద పడి దెబ్బలు తగిలించుకుంటున్నారని వారి గోడును  విన్నవించారు. మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడ పోతున్నాయని బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికార పార్టీ పాలకవర్గం ఉండగా ఈ సమస్య ఉంటే పరిస్థితి ఏమిటని వారు పాలకవర్గంని నిలదీశారు. రోడ్డుపై ధర్నాకి కిలోమీటర్ మేరకు ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించి పోవడంతో స్థానిక ఎస్ఐ విజయ్ కృష్ణ ఉద్రిక్తతను సర్దుబాటు చేసి వారికి ఈ సమస్యను అధికారులతో చర్చించి తీరుస్తామని హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత విరమించుకున్న గ్రామస్తులు ఈ సమస్య తీర్చకపోతే కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తమనీ హెచ్చరించారు.