పేదలకు వరం లాంటిది కళ్యాణ లక్ష్మీ పథకం

Published: Tuesday January 25, 2022
మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడిపల్లి, జనవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం వరం లాంటిదని కార్మికశాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి తెలిపారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొని మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేదింటి ఆడపడుచులకు కేసీఆర్ మేనమామగా మారినారని అన్నారు. మేయర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఈ మేరకు 20 డివిజన్ కార్పొరేటర్ కౌడే పోచయ్య తన డివిజన్లోని లబ్ధిదారులకు మంత్రి, మేయర్ చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ డా పి.రామకృష్ణ రావు, మేడిపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, కార్పొరేటర్లు కేతావత్ సుభాష్, కోల్తూరు మహేష్, బచ్చ రాజు, మద్ది యుగేందర్ రెడ్డి, అలువాల సరిత, ఎంపల్ల అనంత్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు షేక్ ఇర్ఫాన్, పార్టీ నాయకులు మాడుగుల చంద్రా రెడ్డి, పప్పుల అంజిరెడ్డి, యాసారం మహేష్, లేతాకుల రఘుపతి రెడ్డి, బండి సతీష్ గౌడ్, అలువాల దేవేందర్ గౌడ్, పాశం బుచ్చి యాదవ్,  చెరుకు పెంటయ్య గౌడ్, జావిద్ ఖాన్, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.