బెల్టు షాపులు మా ఉపాధి ని దెబ్బతీస్తున్నాయి. ...పొన్కల్ గౌడ సంఘం అధ్యక్షుడు పోడేటి సతీశ్ గౌడ్.

Published: Monday September 12, 2022
జన్నారం , సెప్టెంబర్12, , ప్రజాపాలన:
 
మంచిర్యాల జిల్లా జన్నారంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో మద్యం బెల్టుషాపులు ఉండటం వలన తమ ఉపాధి ని దెబ్బతీస్తున్నాయని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ
.పొన్కల్  ( గౌడ సంఘం ) అధ్యక్షుడు పోడేటి సతీశ్ గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. విచ్చలవిడిగా బెల్డ్ షాపులు ఏర్పడడము వలన కల్ల్లు గీతవృత్తి పైనా ఆధారపడే వారి జీవితం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు.  గ్రామాల్లో నివసించే  మందు మద్యానికి అలవాటు పడిపోతున్నారని అన్నారు. ఎన్నో పోషకాలు వున్న తెల్లకల్లు పైన చిన్న చూపు చుస్తుండడముతో గౌడ వృత్తి కోనసాగించడం గగణమై పోతుందని అన్నారు. తమ మేలును ఆకాంక్షించే ఆబ్కారీ శాఖ వారు ,  రాష్ట్ర ప్రభుత్వం సైతం మద్యం అమ్మకాలపైనే ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి కైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించే వారిపైన కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అధ్వర్యంలో  రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు,  రాస్తారోకోలు చేపడుతామని హెచ్చరించారు .  ఈ సమావేశంలో
మోకుదెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎరుకల రాజుగౌడ్  , పొన్కల్ గౌడ సంఘం  ఉపాధ్యక్షులు బూరగడ్డ శంకర్ గౌడ్, ఎరుకల శంకర్ గౌడ్,  బోంగొని లింగాగౌడ్,  ప్రధాన కార్యదర్శి  కొండ లక్ష్మినారాయణ గౌడ్,  నాయకులూ మెరుగు సత్యగౌడ్,  కోట రవిగౌడ్,  అంజాగౌడ్ , అమరగోని నాగరాజు గౌడ్,  దాసరి రాజేష్ గౌడ్,  కొండ సురేష్ గౌడ్,  ఎరుకల శ్రీనివాస్ గౌడ్,  రేవెళ్ళి నర్సాగౌడ్ ,  గౌడ సంఘనాయకులూ తదితరులు పాల్గొన్నారు.