బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల పై అవగాహన సదస్సు

Published: Tuesday February 08, 2022
ముఖ్యఅతిథిగా మధిర ఎక్సైజ్ సిఐ కె నాగేశ్వరరావు
బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో యువత పై మాదకద్రవ్యాల ప్రభావం మరియు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు యువత పాత్ర పై అవగాహన సదస్సు ఎస్సైజ్ మరియు పొలీస్ శాఖల ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న మధిర ఎస్సైజ్ సి.ఐ కె నాగేశ్వర్ రావు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల యువత భవిష్యత్తు పై కలిగే అనర్థాల మరియు వాటికి బానిసగురి కావడం వలన వారి భావిషత్తు పై పడే దుష్ప్రభావాలను గురించి వివరించి ప్రతి విద్యార్థి ఎటువంటి పెడదారి పట్టకుండా మంచిగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని మానసికంగా దృడంగా ఉండటంతో పాటు డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాల పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోనకల్ ఎస్ఐ కవిత, ఎక్సైజ్ ఎస్ ఐ శార్వాణి, కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపల్ జోనాధన్ బాబు, మధిర లేబర్ ఆఫీసర్ చందర్, బోనకల్ సర్పంచ్ సైదా నాయక్, ఉప సర్పంచ్ రాఘవ్ గౌడ్ కళాశాల సిబ్బంది మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.