పలువురు దాతల వస్త్రాల వితరణ మధిర సెప్టెంబర్ 11 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆది

Published: Monday September 12, 2022

ఆజాద్ రోడ్డు లో ప్రముఖ సామాజిక సేవకులు లంకా కొండయ్య లంకా సేవ ఫౌండేషన్ నిర్వహకులునిర్వహిస్తున్న మహాత్మాగాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంక్ కు మధిర పట్నంలోని పలువురు దాతలు ఉచితంగా పాత బట్టలు వితరణగా అందించినారు. ఇందులో కొంతమంది దాతలు వివరాలు మెడికల్ స్టోర్ ఉద్యోగి పోలేపల్లి సత్య నారాయణ, ప్రముఖ టీడీపీ నాయకులు శ్రీ వంకాయలపాటి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు మేడేపల్లి శ్రీనివాసరావు, ఆర్టిసి నాయకులు విశ్రాంత కoడక్టర్ యస్కె అబ్దుల్ ఖాదర్ ఆర్టిసి యూనియన్ నాయకులు స్వర్గీయ ఆర్విఎన్  రెడ్డి గారి కుటుంభికులు ప్రముఖ ఉపాధ్యాయలు శ్రీ బూసా కోటేశ్వరరావు గారు మొదలుగు దాతలు ముందు కు వచ్చి మానవ సేవే మాధవ సేవ అని లంకా కొండయ్యకు ఈ బట్టలు అందించినారు. ఈ బట్టలు నిరుపేదలు కొండయ్య గృహానికి వచ్చి తీసుకొని వారి అవసరాలు తీర్చు కుంటున్నారు.  ఈ కార్యక్రమం లో వాలంటీర్లు లంకా శ్యామ్ కుమార్ కరుణ లియోనా అంజి గోపి,సాయి,పండు పాల్గొన్నారు.