కూరకుల వెంకయ్య ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు

Published: Friday February 10, 2023

vబోనకల్ , ఫిబ్రవరి 9 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని ఆళ్లపాడు కే వి యం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు కూరాకుల వెంకయ్య 19వ వర్ధంతినీ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతూ వేంకయ్య ని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాలను విద్యార్థులు ఉన్న స్థాయికి ఎదగాలని, క్రమశిక్షణ అలవాటు చేసుకుని ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులంతా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8న మన పాఠశాల ప్రదాత కూరాకుల నాగభూషణం కృషితో వారి తమ్ముడైన కూరాకుల వెంకయ్య మరణించినందున వేంకయ్య మరణంతో వారి పేరున పాఠశాల ఏర్పాటు చేసి స్థలంతో పాటు బిల్డింగులు ఏర్పాటు చేయించి ప్రతి ఒక్క విద్యార్థి వెంకయ్య ని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థితినుండి ఉన్నత స్థాయికి ఎదగాలని, వెంకయ్య చిన్నతనంలోనే మంచి అలవాట్లు చదువు పట్ల కృషి పట్టుదల ఉండి ఐఎఫ్ఎస్ స్థాయికి ఎదిగి ఆ వ్రత్తి పట్ల విద్యా విధానంలో అనేక మందికి సేవా కార్యక్రమాలు చేశారనీ కొని ఆడారు. ఆయన ఆకాల మరణం వల్ల ఇంతటితో ఆగకుండా ఉండాలనే ఉద్దేశంతో డిసిసిబి చైర్మన్ కూరకుల నాగభూషణం ఆళ్లపాడు పాఠశాలను ఎంచుకొని గ్రామంలో ఎదిగే విద్యార్థులు కోసం కార్యక్రమాలు చేసుకునేందుకు పాఠశాల విద్యార్థుల పట్ల మక్కువ చూపుతున్నందుకు నాగభూషణం కి వేంకయ్య 19వ వర్ధంతి సందర్భంగా వారికి కి ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. ప్రతి విద్యార్థి వెంకయ్య ని ఆదర్శంగా తీసుకొని మంచి క్రమశిక్షణ నేర్చుకుని ఉపాధ్యాయుల పట్ల గౌరవం కలిగి అన్ని రంగాలలో ముందుండాలని కూరాకుల వెంకయ్య పేరు నిలబెట్టి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సర్పంచ్ మర్రి తిరుపతిరావు విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా ప్రధానోపాధ్యాయులు ఏ రమేష్ , అధ్యక్ష వహించి సభను నిర్వహించారు. అనంతరం పిల్లలకు క్యిజు కాంప్ టేషన్ కార్యక్రమాలు నిర్వంచారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ బండి పుల్లయ్య, సామాజిక కార్యకర్త మరీదు బరకయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పుష్పవల్లి సరోజిని, సుభాని, విద్యార్థులు గ్రామ పెద్దలు జంపాల పూర్ణయ్య పాల్గొన్నారు.