బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన కార్పోరేటర్

Published: Wednesday October 06, 2021
బాలాపూర్, అక్టోబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : విజయదశమి కానుకగా బతుకమ్మ చీరలు ఇస్తున్నారని ఇంద్రావత్ రవి నాయక్ అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ లో దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలను స్థానిక ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి ఆదేశాలనుసారంగా ఆ డివిజన్లో ఉన్న కాలనీవాసులకు మంగళవారం స్థానిక కార్పొరేటర్ ఇంద్రావత్ రవి నాయక్ చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ. ఈ డివిజన్ ప్రజలు ఆనందిస్తూ తెలంగాణ రాష్ట్ర సీఎం కు సబితమ్మ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్ పి లు పాల్గొన్న వారందరికీ సద్దుల బతుకమ్మ మరియు దేవి నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.