యువత డ్రగ్స్ కు బానిస కావద్దు

Published: Monday June 27, 2022

జగిత్యాల, జూన్ 26 (ప్రజాపాలన ప్రతినిధి): ప్రపంచ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవంను పురస్కరించుకొని డ్రగ్స్ కు యువత బానిస కావద్దు,  బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దుని జిల్లా ఎస్పీ సింధు శర్మ యువతకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం దృష్టిపెట్టాలని అన్నారు. ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తు సరైన మార్గదర్శనం చేయాలని అన్నారు. మెదడు, నరాల వ్యవస్థ దెబ్బతిని శాశ్వత మానసిక వైకల్యం వచ్చే అవకాశాలుంటాయని అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ 1985 ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. మాదకద్రవ్యాలు అమ్మడం, సేవించడం రెండు నేరమని అన్నారు. పోలీస్ శాఖ జిల్లాలో  డ్రగ్స్ పట్ల యువతలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గడిచిన 2021 సంవత్సరం  జిల్లాలలో గంజాయికి సంబంధించి మొత్తం 14 కేసులు నమోదయ్యాయి ఇందులో 38 మందిని అరెస్టు చేయడంతో పాటు 30.165 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. 2022 సంవత్సరంలో  జిల్లాలలో గంజాయికి సంబంధించి మొత్తం 06 కేసులు నమోదయ్యాయి ఇందులో 23 మందిని అరెస్టు  చేయడంతో పాటు 11.20 కేజీల గంజాయిని, 11 గంజాయి మొక్కలను సీజ్ చేయడం జరిగిందని అన్నారు.