దళిత స్మశాన వాటిక స్థలాన్ని కాపాడలంటూ దళితుల ధర్నా

Published: Monday July 04, 2022
కరీంనగర్  జూలై 2 ప్రజాపాలన విలేకరి :
దళితుల స్మశాన వాటిక భూమిని కాపాడాలి..    కరీంనగర్ నడిబొడ్డున ఉన్నటువంటి కార్కానగడ్డ స్మశానవాటిక భూమిని కాపాడాలని కోరుతూ అంబేడ్కర్‌ క్లబ్ సభ్యులు ఆదివారం నాడు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 53 లో గల దళితుల స్మశాన వాటిక భూమిని గతంలో కొందరు కబ్జా చేశారని అన్నారు. అతి పురాతనమైన కార్కానగడ్డ సమాధుల వద్ద పితృ దేవతలను స్మరించుకొని ప్రతి దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని పెర్కోన్నారు. నగరంలోని సుభాష్ నగర్, అంబేడ్కర్‌ నగర్ , సవరన్ స్ట్రీట్, కిసాన్ నగర్ తోపాటు పలు కాలనీలకు సంబంధించిన  దళితుల భూమిని కబ్జా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో దళితులమంతా కలిసి గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్, కలెక్టర్ గార్లను కలిసి మా గోడు వెళ్లబూసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమం లో క్లబ్ ప్రధాన కార్యదర్శి కనమల్ల సుదీర్, ఉపాధ్యక్షులు గొర్రె శ్రీనివాస్, మాజీ ప్రధాన కార్యదర్శులు నిజాంపేట్ శ్రీనివాస్ , బైరం కుమార్ ,సభ్యులు కె. శ్రీనివాస్, బి.స్వామి, శ్రీకాంత్, పృథ్వీ, అక్షయ్ తోపాటు అధిక సంఖ్యలో దళితులు  పాల్గొన్నారు.