మేరు కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Monday October 10, 2022
మేడిపల్లి, అక్టోబర్ 9 (ప్రజాపాలన ప్రతినిధి)
మేరు కులస్తుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.
ఉప్పల్ భగావత్ హెచ్ఎండిఏ లే అవుట్ లో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మేరు కుల బందువుల సర్వసభ్య సమావేశం, దసరా ఆత్మీయ సమ్మేళనం, మరియు వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ మేరు కులస్తులను సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటారని తెలిపారు. మేరు కులస్తుల ఆత్మ గౌరవ భవనానికి ఓక ఎకరం, కోటి రూపాయలు ప్రభుత్వం ఇచ్చారని,   భవన నిర్మాణానికి ఇంకా మూడు కోట్లు నిధులు ఇవ్వాలి,ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే పనిని మేరు కులస్తులకే ఇవ్వాలని మేరు సంగం రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ రావు డిమాండ్ చేశారు.ఈ  కార్యక్రమంలో మేరు సంఘము రాష్ట్ర అధ్యక్షులు, ఆత్మ గౌరవ భవన ట్రస్ట్ చైర్మన్ శ్రీ కొవ్వూరు భాస్కరరావు , ట్రస్టీలు పొడిచెట్టి నరసింగ రావు, దీకొండ నర్సింగరావు, ఎస్బి సంగేవార్, కీర్తి శేఖర్,సభ కమిటీ కన్వీనర్ అడప వెంకటేశ్వర్రావు,
కె.వెంకటేష్ మేరు కుల  బంధువులు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.