కేంద్రాన్ని ప్రారంభించిన జడ్పీటీసీ దిరిశాల ప్రమీల.. తల్లాడ, నవంబర్ 29 (ప్రజా పాలన న్యూస్):

Published: Wednesday November 30, 2022

 తల్లాడ మండలంలోని బస్వాపురం గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం గ్రామ సర్పంచ్ సూరంపల్లి లక్ష్మీ నారాయణతో కలిసి తల్లాడ జడ్పీటీసీ దిరిశాల ప్రమీల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. ధాన్యాన్ని ఆరబెట్టి నిబంధనల ప్రకారం కేంద్రానికి తీసుకురావాలన్నారు. రైతులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తాజుద్దీన్, టిఆర్ఎస్ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావు, ఏఈఓ నాగేశ్వరరావు, గ్రామ రైతు సమన్వయకర్త చాకర్లమూడి కృష్ణారావు, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సైదురెడ్డి, సెక్రటరీ నరసింహారావు, బీసీ నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు, రైతులు సూరంపల్లి బాబురావు, వెంకటరెడ్డి దొబ్బల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.