విద్యార్థులు చట్టాల పై అవగాహన కలిగి వుండాలి:

Published: Monday September 05, 2022
జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్. మధిర సెప్టెంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలి పరిధిలో ఆదివారంతో నాడు శ్రీనిధి డిగ్రీ కళాశాలలో మధిర మండల/తాలూకా న్యాయసేవాధికార ఆద్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు జరిగింది. సీనియర్   న్యాయవాది చావలి రామరాజు అద్యక్షతన జరిగిన ఈ సదస్సులో మధిర ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి శ్రీ ధీరజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు నేటి చట్టాల పై అవగాహన పెంచుకోవాలని, యుక్త వయస్సు లో చెడు అలవాట్లకు దూరంగా వుండాలని, మంచిగా చదువుకొని బంగారు భవిష్యత్తు కు బాటలు వేసుకుని దేశానికి సేవ చేయాల్సిన భాద్యత యువతపైనే వుందని విద్యార్థులకు చట్టాల పై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మేడేపల్లి సతీష్, శ్రీనిధి కళాశాల కరస్పాండెంట్ బట్టా అంజన్ బాబు, పారా లీగల్ వాలంటీర్ సుజాత, కోర్టు సిబ్బంది సూర్యనారాయణ, మురళి, అలీ, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.