యూత్ కాంగ్రెస్ లో ఎటువంటి నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేదు

Published: Wednesday June 02, 2021
కోరుట్ల, జూన్ 1, (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ లో ఇప్పటివరకు ఎలాంటి నామినేటెడ్ పోస్ట్ లు భర్తీ చేయలేదని కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నామినేటెడ్ పదవులు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే మండలాల వారీగా, పట్టణాలలో పదవులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. దీనికి యువజన కాంగ్రెస్ నాయకులు అందరూ సహకరించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరాడు.