లంకా, ఎంఎస్ఆర్ లకు విశ్వజనని జాతీయ పురస్కారం

Published: Tuesday April 26, 2022
మధిర ఏప్రిల్ 25 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆజాద్ రోడ్ లో గల చెందిన ప్రముఖ సామజిక సేవకులు, జానపద కళాకారుడు శ్రీ లంకా కొండయ్యకు, హోమియో హాస్పిటల్ వాలంటీర్, గణిత ఉపాధ్యాయులు శ్రీ మేడేపల్లి శ్రీనివాసరావు లకు హైదరాబాద్ కు చెందిన విశ్వజనని ఫౌండేషన్ వారు సంస్థ ఏర్పాటు సందర్బంగా వివిధ రంగాలలో స్వచ్చంద సేవలు అందించిన వారికి ఇచ్చే అవార్డులలో భాగంగా సామజిక సేవా, కళారంగం లోని సేవలకు గాను లంకా కొండయ్యకు జాతీయ సేవా పురస్కారం మరియు విద్యారంగం, హోమియో వాలంటీర్ సేవలకు మేడేపల్లి శ్రీనివాసరావుకు జాతీయ సేవా పురస్కారం అందించటం జరిగింది. ఈ సేవా పురస్కారాలు విశిష్ట అతిథిగా హాజరైన తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు మరియు సినీ నటి రాగిణి, తెలంగాణ మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మూవీ ఆర్టిస్ట్ కిరణ్ మరియు రామోజీ ఫిలిం సిటీ మేనేజర్ టి ఆర్ ఎల్ రావు, విశ్వజనని ఫౌండేషన్ అధ్యక్షులు బొగ్గవరపు బ్రహ్మానందం చేతుల మీదుగా హైదరాబాద్ అబిడ్స్ సెంటర్, తిలక్ రోడ్ లోని తెలంగాణ సారస్వతి కళా పరిషత్ నందు ఈ అవార్డును ఆదివారం రాత్రి 11 గంటలకు ప్రదానం చేయటం జరిగింది. ఈ సందర్బంగా కొండయ్య, ఎంఎస్ఆర్ లు వారు ఒకవైపు ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ, మరొక వైపు తీరిక సమయాలలో సెలవుదినాలలో సమాజ హితం కోసం పాటుపడుతూ జనజాగృతికి కృషి చేస్తున్నారు. ఈ అవార్డు రావటం పట్ల ఖమ్మం జిల్లాతో పాటు మధిర నియోజకవర్గ ప్రముఖులు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కళాకారులు, వ్యాపారస్తులు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మరియు బంధు మిత్రులు కొండయ్యకు ఎమ్మెస్సార్ కి అభినందనలు తెలియజేశారు.