వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చితే కఠిన చర్యలు ** ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ **

Published: Saturday December 24, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 23 (ప్రజాపాలన, ప్రతినిధి) : వన్యప్రాణుల కోసం వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ డిఎస్పి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అధికారుల నుండి అనుమతులు లేకుండా దొంగతనంగా విద్యుత్ తీగలు అమర చేయడం వలన అవి ప్రమాదాలకు దారి తీస్తున్నాయని, అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగించి తమ దృష్టికి వస్తే అలాంటి వారిపై సెక్షన్ 307అటెండ్ మర్డర్, నాన్ బేవెలబుల్  కేసులు, వీడి యాక్ట్ నమోదు చేస్తామని, కావున ఎవరు కూడా అనుమతులు లేకుండా విద్యుత్ తీగలు అమర్చకూడదని తెలిపారు.