జాతీయ కీటక జనిత వ్యాధులు నియంత్రణ కార్యక్రమం

Published: Monday May 17, 2021
బాలపూర్, మే16, ప్రజాపాలన ప్రతినిధి : డెంగ్యూ దోమలను తరిమి కొడదాం, జాగ్రత్తలు తీసుకుందాం అన్నారు.  బాలపూర్ మండలం మీర్ పేట మున్సిపల్ పరిధి లో ఉన్నటువంటి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని జాతీయ డెంగ్యూ దినోత్సవ పోస్టర్ను సిహెచ్ నర్సింగ్ రావు తో కలిసి సూపర్వైజర్ వినోద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... జాతీయ కీటక జనిత వ్యాధుల కార్యక్రమంలో భాగంగా దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుందాం డెంగ్యూ దోమల ను తరిమికొడదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వినోద్ కుమార్, భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ మారి కోఆర్డినేటర్ సాంబ శివ, శివాని రెడ్డి, మహేశ్వరి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.