విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి వామపక్షాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్

Published: Thursday July 21, 2022
ఆసిఫాబాద్ జిల్లా జులై20(ప్రజాపాలన, ప్రతినిధి) : ప్రభుత్వ విద్యా రంగ సంస్థలు పరిష్కరించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని బుధవారం వామపక్ష విద్యార్థి సంఘాలు పిడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఆధ్వర్యములో విద్యా సంస్థలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి, నాయకులు మహబూబ్ అయూబ్, మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వడం లేదన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా సరైన విద్య ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తక్షణమే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు దుస్తులు అందించాలని, మధ్యాహ్న భోజన ఈ పథకానికి నిధులు పెంచాలని, కార్పొరేట్ ప్రైవేట్, విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని, విద్యార్థులందరికీ ఉచిత బస్ ఇవ్వాలని,డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు అధ్యక్షుడు రమేష్, కళ్యాణ్, విలాస్ తదితరులు పాల్గొన్నారు.