కొత్తగడి హనుమాన్ మందిర్ లో గణనాథుని పూజలు

Published: Friday September 09, 2022
మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ రాజమల్లయ్య పిఎసిఎస్ చైర్మన్ నర్సింలు
వికారాబాద్ బ్యూరో 08 సెప్టెంబర్ ప్రజా పాలన : విజ్ఞాలకు అధిపతిగా కొలువుదీరిన గణనాథున్ని నవరాత్రులలో పూజా కైంకార్యాలు నిర్వహించామని మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ రాజ మల్లయ్య, కొత్తగాడి పిహెచ్సి చైర్మన్ నర్సింలు గురువారం ఒక ప్రకటనలో సంయుక్తంగా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణనాథున్ని అనునిత్యం పూజా కైంకర్యాలతో భక్తి ప్రపత్తులతో భక్తులు కొల్చారని పేర్కొన్నారు. వినాయక చవితి నుండి నిమజ్జనం వరకు గణనాథున్ని విఘ్నాలు తొలగించమని భక్తులు ఆరాధించారు. కొత్తగడి గ్రామాన్ని చల్లగా చూడాలని పాడి పంటలతో సమృద్ధిగా వృద్ధి చెందాలని వినాయకున్ని భక్తితో కొలిచారు. నేటి యువత దైవచింతనే పరమావధిగా సన్మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. విద్యాభివృద్ధి చెందుతూ ఆర్థికంగా తమ కుటుంబాలకు ఆసరాగా నిలవాలని కోరారు. ఆది పూజలు అందుకునే గణనాథుని స్మరించుకొని తాము చేపట్టాల్సిన మంచి పనులను నిర్విరామంగా కొనసాగాలని భక్తులు వేడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ గయాజ్ టిఆర్ఎస్ నాయకులు హనుమాన్ మందిర్ యూత్ ప్రెసిడెంట్ ఊరడి మల్లేష్ ముదిరాజ్ టిఆర్ఎస్ టౌన్ జనరల్ సెక్రటరీ ఈశ్వర్ యాదవ్ మాదిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.