షార్ట్ సర్క్యూట్ తో టైలర్ షాప్ దగ్గం రూ 10 వేలు ఆర్థిక సహాయం అందజేసిన కార్పొరేటర్

Published: Wednesday December 21, 2022
మేడిపల్లి, డిసెంబర్ 20 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ గణేశ్ నగర్ నివాసులైన లక్కోజు రమణ గత కొంత కాలంగా శంకర్ నగర్ కాలనీలో ఆరాధ్య లేడీస్ టైలర్ షాప్ ను నడిపిస్తున్నారు. సోమవారం రాత్రి  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో షాపు    ఉన్న కొత్త బట్టలు మరియు ఎలక్ట్రిక్ కుట్టు మిషన్ లు అన్ని దగ్ధమై అపార నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న 26వ డివిజన్ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి
సంఘటన స్థలాన్ని పరిశీలించి, టైలర్ షాప్ యజమాని లక్కోజు రమణకు రూ10 వేల రూపాయలు కాలనీ వాసుల సమక్షంలో ఆర్థిక సహాయం అందించి అధైర్య పడోద్దని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు జగన్నాథ్ రాజ్ ప్రవీణ్ పాశం గోపిరెడ్డి,సంబిరెడ్డి,బుచ్చిబాబు  తదితరులు పాల్గొన్నారు.